ఇండియాలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన హెయిర్ స్టైలిస్ట్‌లలో ఒకరైన జావేద్ హబీబ్ నగరంలోని కాప్ర జమ్మిగడ్డ లో సందడి చేశారు…
హైదరాబాద్: భారతదేశంలొనే అత్యంత ఫేవరెట్ అయిన జావేద్ హాబీబ్ సెలూన్ 148వ బ్రాంచ్ ని కాప్ర జమ్మిగడ్డ వద్ద ప్రారంభమైంది. ప్రముఖ భారతదేశములోని హెయిర్ కటింగ్ లో ప్రసిది చెందిన లెజండ్ జావేద్ హాబీబ్ మరియు ఎం.పి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు తో కలిసి నూతన బ్రాంచ్‌ను ప్రారంభించారు. అధునాతన హెయిర్ స్టైల్స్, ఇతర సేవలు అందించడం ద్వారా కస్టమర్లకు జావేద్ హాబీబ్ బ్యూటీ సలోన్ పూర్తిస్థాయి సంతృప్తిని అందిస్తున్నాయి. కొత్త బ్రాంచి ప్రారంభం సందర్భంగా జావేద్ హాబీబ్ సెలూన్ల నిర్వహకులుభాగ్యవతి మల్లేశం మాట్లాడుతూ, “హైదరాబాద్ లాంటి మెట్రోనగరాల్లో జనాలకు మంచి అనుభవం ఉన్న హెయిర్ స్టైలిస్టులు కావాలి. పార్టీలకు వెళ్లేవారికి, వాటిలో బాగా కనిపించాలని అనుకునే వారికి జావేద్ హాబీబ్ సెలూన్లు అత్యుత్తమ సేవలు అందిస్తాయి. అత్యధినిక టెక్నాలజీ లో శిక్షణ పొందాను. జావేద్ హాబీబ్ సెలూన్లో ఉన్న సిబ్బంది అందరూ తగిన శిక్షణ పొందినవారే” అన్నారు.






