హైదరాబాద్ లో రూ.126 కోట్లతో నికోమాక్ యూనిట్
జపాన్‌కు చెందిన 110 ఏళ్ల చరిత్ర కలిగిన ఇంజనీరింగ్ కంపెనీ నికోమాక్ తైకిషిక క్లీన్రూమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్‌లో తన మూడో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.126 కోట్లతో క్లీన్‌రూమ్ ప్రొడక్షన్‌ను విస్తరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు తెలిపారు. స్టెరైల్ ఇండస్ట్రీస్ రంగంలో ఫార్మా స్యూటికల్, వాక్సిన్లకు అవసరమైన క్లీన్‌రూమ్ వసతుల నిర్మాణం, తయారీలో ఈ కంపెనీకి ప్రత్యేకత ఉంది. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక పెద్ద ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో క్లీన్రూమ్లను ఈ కంపెనీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీకి ఐడీఏ బొల్లారంలో రెండు యూనిట్లు పనిచేస్తున్నాయి. జపాన్ సాంకేతికతతో ఈ క్లీన్‌రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు కంపెనీ వెల్లడిరచింది.






