Jagga Reddy: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను

వచ్చే శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, తన సతీమణి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి (Nirmala Reddy) ని బరిలో నిలుపుతానని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) ప్రకటించారు. సంగారెడ్డి (Sangareddy) లో అంబేడ్కర్ మైదానంలో నిర్వహించిన దసరా (Dasara) సంబరాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మరో పదేళ్ల తర్వాత ఎన్నికల్లో పోటీపై ఆలోచన చేస్తానన్నారు. తనకు మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయాన్ని అందించిన సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు తీసుకొస్తానని పేర్కొన్నారు.