Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి మల్లన్న ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఆహ్వాన పత్రిక అందించారు. అసెంబ్లీ కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించి, స్వామివారి శేష వస్త్రాలను, తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందించారు. డిసెంబర్ 29న ఉదయం 10:45 గంటలకు మల్లికార్జున స్వామి వారి కల్యాణం, 19 జనవరి 2025 నుంచి 10 ఆదివారాల పాటు, 23 మార్చి 2025 వరకు జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ముఖ్యమంత్రితో తెలిపారు.