Minister Sridharbabu : పెద్దపల్లిలో వీ హబ్ ఏర్పాటు చేస్తాం: శ్రీధర్‌బాబు

మహిళలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టామని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridharbabu) తెలిపారు. పెద్దపల్లిలో ఏర్పాటుచేసిన ఇందిరాశక్తి సంబరాల సభకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) , సీతక్క (Seethakka) , ఎమ్మెల్యే విజయరమణరావుతో కలిసి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో మహిళా సంఘాల నుంచి 9 బస్సులను ఆర్టీసీలో అద్దెకు తీసుకున్నాం. గతంలో కొందరు పెద్దమనుషుల నుంచే ఆర్టీసీ బస్సులు (RTC buses) అద్దెకు తీసుకునేవారు. విద్యార్థుల యూనిఫాంలు కుట్టే పనులను మహిళా సంఘాలకే అప్పగించాం. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే అకాశం కూడా మహిళలకే ఇచ్చాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్దపల్లిలో వీ హబ్ ఏర్పాటు చేస్తాం. మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు ఇవ్వడం గురించి మాత్రమే ఆలోచించారు. రాష్ట్ర జలహక్కుల విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ మేం రాజీపడేది లేదు అని అన్నారు.