హైదరాబాద్‌లో పకడ్బందీగా లాక్డౌన్
హైదరాబాద్‌లో పకడ్బందీగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు కట్టుదిట్ట చర్యలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలతోపాటు కేసులు నమోదు చేస్తున్నారు. రవాణా, రిజిస్ట్రేషన్ శాఖలు, నిర్మాణ రంగానికి వెసులుబాటు కల్పించగా, నగరంలోని రహదారులపై రద్దీ ఏర్పడింది. ఎలక్ట్రికల్, ప్లంబర్, సిమెంట్, స్టీల్ దుకాణాలు అందుబాటులోకి రావడంతో వాహనదారులు రోడ్లపైకి వస్తున్నారు. 33 శాతం ఉద్యోగులను ఐటీ కార్యాలయాలకు వెళ్లేలా అనుమతించడం, మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో జన సంచారం పెరిగింది. సడలింపులిచ్చిన వారిని మాత్రమే వదిలేస్తున్న అధికారులు మిగితా వాహనాలను సీజ్ చేస్తున్నారు. లంగర్‌హౌజ్, మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్, కూకట్పల్లి, పోలీస్ స్టేషన్ పరిధిలోని వైజంక్షన్, జేఎన్టీయూ, సికింద్రాబాద్ పరిధిలోని సంగీత్, రాజీగంజ్, బేగంపేట, ఒలిఫెంటా బ్రిడ్జి, గోపాలపురం, మారేడుపల్లితోపాటు పలు కూడళ్ల వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.






