Central University : హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులను వెంటనే ఉపసంహరించండి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University ) విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పోలీసులను ఆదేశించారు. సచివాలయంలో హెచ్‌సీయూ టీచర్స్ అసోసియేషన్ (Teachers Association) , సివిల్ సొసైటీ గ్రూప్స్ (Civil Society Groups)తో, సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు శ్రీధర్‌బాబు (Sridharbabu), పొంగులేటి (Ponguleti) తో చర్చించిన అనంతరం భట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించిన కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు అధికారులకు తగు సూచనలు చేయాల్సిందిగా న్యాయశాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.