ప్రజాభవన్‍కు బాంబు బెదిరింపు

హైదరాబాద్ నగరంలోని ప్రజాభవన్‍కు బాంబు బెదిరింపు వచ్చింది. అక్కడ బాంబు ఉన్నట్లు పోలీసు కంట్రోల్ రూమ్‍కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే ప్రజాభవన్ వద్దకు బాంబు స్క్వాడ్ సిబ్బంది చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. చివరికి ఇది ఆకతాయిలు చేసిన పనిగా పోలీసులు నిర్ధారించారు.