America: అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి

అమెరికాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లోని చంచల్‌గూడకు చెందిన షెరాజ్ మోహతాబ్ మహ్మద్ (Sheraz Mohtab Mohammed) ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నత ఉద్యోగావకాశాల కోసం ఇటీవలే అమెరికాకు వెళ్లిన షెరాజ్ మోహతాబ్ అకాలంగా మృతిచెందడం అందరినీ కలచివేసింది. షెరాజ్ తండ్రి అల్తాఫ్ మహ్మద్‌ఖాన్ (అల్తాఫ్ గోల్డీ) హైదరాబాద్‌లో కాంగ్రెస్ (Congress) సీనియర్ నాయకుడు. కాగా కొన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. షెరాజ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. షెరాజ్ మరణ వార్తతో స్వస్థలం చంచల్‌గూడలో విషాదఛాయలు అలముకున్నాయి.