Jeeto Content Exhibition : జీటో కనెన్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభం

హెచ్‌ఐసీసీలో జీటో కనెక్ట్ ఎగ్జిబిషన్ (Jeeto Content Exhibition ) ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ప్రారంభించాడు. జైన్ ఇంటర్నెషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు ఎగ్జిబిషన్ జరగనుంది. ఎగ్జిబిషన్‌లో 600కు పైగా స్టాల్స్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. జీటో కనెక్ట్‌కు 2 లక్షల మందికిపైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. వాణిజ్య నెట్‌వర్కింగ్, స్టార్టర్ ప్రోత్సాహం, సెషన్లు, వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు(Sridhar Babu) , బాబా రామ్‌దేవ్ పాల్గొన్నారు.