హైదరాబాద్‌లో తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్ : మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌ను ఏఐ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)కు పెరిగిపోతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మిట్‌లో దాదాపు 2,000 మంది నిపుణులు పాల్గొననున్నారని మంత్రి తెలిపారు. అలాగే ఈ సమ్మిట్ విజయవంతం చేసేందుకు ప్రభుత్వం నాస్కామ్, హైసియా వంటి పరిశ్రమ ప్రతినిధులతో కలిసి పని చేస్తోందన్నారు.