BJP: బీజేపీతోనే బీసీలకు న్యాయం : రామచందర్‌రావు

బీసీలను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు (Ramachandra Rao) విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ (BJP) తోనే బీసీలకు న్యాయం జరుగుతుందనే నిర్ణయానికి ప్రజలు కూడా వచ్చారన్నారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో గెలుస్తామనే నమ్మకం తమకు ఉందని తెలిపారు. నగరాన్ని ప్రపంచానికే తలమానికం గా మారుస్తామని బీఆర్‌ఎస్ గతంలో చెప్పింది. కానీ అందుకు అనుగుణంగా ఎలాంటి ముందడుగు పడలేదు. కాంగ్రెస్ కూడా అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చింది. ఓట్ల కోసం ఈ రెండు పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు దిగాయి. రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేస్తాం. ఈ ఉప ఎన్నికల్లో గెలిచి ప్రధాని మోదీ (Modi)కి గిఫ్ట్‌గా ఇవ్వాలి. రేపటి నుంచి కార్యకర్తలు, నేతలు జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేయాలి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ (BRS) లోపాయికారీ ఒప్పందాన్ని తిప్పికొట్టాలి అని కోరారు.