KTR: పోలీసు నిర్బంధాలు మాకు కొత్త కాదు

చల్ బస్ భవన్ పిలుపు దృష్ట్యా బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు (Harish Rao), పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతల ఇళ్ల వద్ద పోలీసులు (Police) మోహరించారు. తనతో పాటు ఇతర నేతల గృహ నిర్బంధంపై కేటీఆర్ (KTR) మండిపడ్డారు. శాంతియుతం గా ఆర్టీసీ ఎండీ (RTC MD) కి వినతిపత్రం ఇవ్వాలని తమ పార్టీ పిలుపునిచ్చిందన్నారు. ఛార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని ఆయన్ను కోరనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సులు (RTC buses) ఎక్కి వెళ్తామంటే భారీగా పోలీసులను మోహరించారన్నారు. ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా ఆపడానికి ఇంత మంది పోలీసులను పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉత్సాహం హైదరాబాద్‌లో నేరాల అదుపులో చూపిస్తే మంచిదని వ్యాఖ్యానించారు. బస్సు ఛార్జీల పెంపును వెనక్కి తీసుకునే వరకు పోరాడుతూనే ఉంటామని తెలిపారు. పోలీసు నిర్బంధాలు తమకు, తమ పార్టీకి కొత్త కాదన్నారు.