Hyderabad : ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్ : రేవంత్ రెడ్డి

ప్రముఖ బయోటెక్ సంస్థ యామ్ జెన్ (Amgen) నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యామ్‌జెన్ సంస్థ హైదరాబాద్ (Hyderabad)ను ఎంచుకోవడం ఆనందంగా ఉంది. లైఫ్ సైన్సెస్ (Life Sciences ) రంగంలో నగరంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ అత్యంత వేగంగా ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోంది అని పేర్కొన్నారు.