High Court: తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దు : హైకోర్టు

ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ (KTR) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు (High Court) లో విచారణ ముగిసింది. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని ఆదేశిస్తూ, మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై గత విచారణ సందర్భంగా ఈ నెల 30 వరకు అరెస్టు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేటీఆర్‌పై ఏసీబీ(ACB) నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 27కి వాయిదా వేసింది. ఆ తర్వాత విచారణ 31కి వాయిదా వేసింది. తాజాగా ఇరు వైపులా వాదనలు ముగియగా, కేటీఆర్ పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది. తీర్చు ఇచ్చే వరకు అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది.