Harish Rao: నాపై ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా : హరీశ్‌రావు

ఇటీవల కవిత తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమం నుంచి 25 ఏళ్లుగా తన ప్రస్థానం తెరిచిన పుస్తకమని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో నాపై, పార్టీ పై కొందరు ఆరోపణలు చేశారు. ఎందుకు చేశారో? ఎవరికీ లబ్ధి చేకూర్చేందుకు చేశారో? నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. కేసీఆర్(KCR) గత పదేళ్లుగా నిర్మించిన ఒక్కో వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్రంలో ఓ వైపు రైతులు యూరియా (Urea) కొరతతో ఇబ్బంది పడుతుంటే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మంచివి కావు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా ముందునన్నే కర్తవ్యం అని అన్నారు.