ఎన్నికలకు ముందు ఉచితమని చెప్పి.. ఇప్పుడు : హరీశ్‌రావు

ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్‌ను ఉచితంగా అమలు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఎన్నికలకు ముందు ఉచితమని చెప్పి, ఇప్పుడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గమన్నారు. అధికారులకు లక్ష్యాలు విధిస్తూ ప్రజలను వేధిస్తున్నారని విమర్శించారు. ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా అమలయ్యేలా చూసే బాధ్యత బీఆర్‌ఎస్ తీసుకుంటుందన్నారు.