High Court : మరోసారి హైకోర్టును ఆశ్రయించిన హరీశ్‌రావు

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) మరోసారి హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) నివేదికను సస్పెండ్ చేయాలని మధ్యంతర పిటి ష న్ దాఖలు చేశారు. అసెంబ్లీ (Assembly ) లో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టకుండా చూడాలన్నారు. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టివేయాలని గతంలోనూ కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లు (Petitions) దాఖలు చేశారు. పిటిషన్ల ఆధారంగా గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు నోటీసులు జారీ చేసి వాయిదా వేసింది. అక్టోబర్‌లో ఈ పిటిషన్లపై తదుపరి విచారణ చేపట్టనుంది.