Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట

తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ రావుకు (Harish Rao) ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊరట లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసు దర్యాఫ్తుపై హైకోర్టు స్టే విధించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ చేపట్టే వరకు కేసులో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ ఫోన్‌ను ఎవరో ట్యాప్ చేశారు. ఈ విషయంపై ఆయన పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఆ కంప్యూటర్ ఆపరేటర్.. గతంలో మంత్రి హరీశ్ రావు (Harish Rao) వద్ద పనిచేశాడు. దీంతో పోలీసులు.. ఆయన పేరును కూడా కేసులో జతచేశారు. దీనిపై స్పందించిన హరీశ్ రావు.. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ హరీశ్ రావు కోర్టుకెళ్లారు. ఈ క్రమంలోనే హరీశ్ రావును (Harish Rao) అరెస్టు చేయకుండా హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించాల్సిన లాయర్ సిద్ధార్థ లూథ్రా.. మరో కేసులో బిజీగా ఉన్నందున సమయం కావాలని కోర్టును పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. దీంతో తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు కేసు దర్యాప్తుపై స్టే విధించింది.