కేసీఆర్ నిబంధనలు లేకుండా.. రేవంత్ రెడ్డి నిబంధనలతో

కేసీఆర్ పాలనలో నిబంధనలు లేకుండా రుణమాఫీ చేశామని, రేవంత్ రెడ్డి పాలనలో నిబంధనల పేరుతో రుణమాఫీ చేయట్లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. వనపర్తిలో రైతు ప్రజా నిరసన సదస్సులో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వరంగల్ వేదికగా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చడం లేదని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి వచ్చాక పాత పథకాలను ఆపేశారని, పథకాలపై ప్రశ్నించిన తమపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.