Harish Rao: ఆ లేఖపై సీఎం ఎందుకు స్పందించట్లేదు? : హరీశ్‌రావు

423 టీఎంసీల గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీళ్లు తరలించుకుపోతున్నా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించట్లేదని విమర్శించారు. ఆయన ఎందుకు స్పందించట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంగా ప్రజా ప్రయోజనాలు కాపాడతారా, స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటారా? అని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project)ను పరిశీలిస్తున్నామని కేంద్రం లేఖ రాసింది. కేంద్రం లేఖపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదో చెప్పాలి. గోదావరి జలాలలను ఏపీ, మహారాష్ట్ర (Maharashtra) తరలిస్తామని చెబుతున్నాయి. కృష్ణా జలాలను తరలిస్తామని కర్ణాటక, మహారాష్ట్ర చెబుతున్నాయి అని తెలిపారు.