Komuravelli Mallanna: అంగరంగ వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం
సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి (Komuravelli Mallikarjuna Swamy) కల్యాణం ఆదివారం ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద అంగరంగ వైభవంగా జరిగింది. దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కల్యాణానికి హాజరై ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మల్లన్న ఆలయాన్ని కూడా మాస్టర్‌ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేస్తామన్నారు. అమ్మవార్ల స్వర్ణ కిరీటాల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. సిద్దేశ్వరానందగిరి మహారాజ్ స్వామిజీ పర్యవేక్షణలో ఈ కల్యాణ వేడుక జరిగింది.సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొనడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి (Kommuri Pratap Reddy), కల్యాణోత్సవ ప్రత్యేకాధికారి రామకృష్ణారావు, ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్, ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.






