High Court : హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేసింది. కృత్రిమమేధ సాయంతో నకిలీ వీడియోలు (Fake videos) సృష్టించి ప్రచారం చేశారని పిటిషన్‌లో పేర్కొంది. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామి (Menaka Guruswamy) వాదనలు వినిపించారు. మొత్తం 400 ఎకరాలకు సంబంధించిన నకిలీ వీడియోలు, ఆడియో క్లిప్పింగ్స్ (Audio Clippings) తయారు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భూమిని చదును చేసే క్రమంలో బుల్డోజర్లను చూసి జింకలు (Deer,), నెమళ్లు పారిపోతున్నట్లు నకిలీ వీడియోలు సృష్టించారని పిటిషన్‌లో పేర్కొంది. నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. పిటిషన్‌పై ఏప్రిల్ 24న వాదనలు వింటామని హైకోర్టు వెల్లడిరచింది.