అమెరికా తర్వాత హైదరాబాద్ లో అతిపెద్ద క్యాంపస్
హైదరాబాద్‌లో గూగుల్ సొంత క్యాంపస్‌ను నిర్మిస్తోంది. అమెరికా తరువాత అతిపెద్ద సొంత క్యాంపస్‌ను గూగుల్ నిర్మిస్తోంది. 2019లో గచ్చిబౌలిలో గూగుల్ 7 ఎకరాల భూమిని సేకరించింది. ఇందులోనే సొంత భవనాలను నిర్మిస్తోంది. మొత్తం 30 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో ఈ క్యాంపస్ రూపుదిద్దుకుంటోంది. దీనిపై మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో స్పందించారు. ఇది కేవలం ఒక కొత్త బిల్డింగ్ ప్రాజెక్ట్ గురించి వార్త మాత్రమే కాదని, ఇది నా మనస్సులో ఇంకేలా నెమ్మదిగా చదవివానని తెలిపారు. గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజ కంపెనీ అమెరికా వెలుపల ఒక నిర్దిష్ట దేశంలో అతిపెద్ద క్యాంపస్‌ను నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇది కేవలం బిజినెస్ వార్త మాత్రమే కాదని, ఇది భౌగోళిక రాజకీయ ప్రకటన అని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు.






