హైదరాబాద్‌లో గ్లోబల్ ఏఐ సదస్సు ప్రారంభం..

సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నేటి తరం అద్భుత ఆవిష్కరణ ఏఐ ప్రశంసించారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్లోబల్ ఏఐ’ సదస్సుకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్ ఏర్పాటులో భాగస్వామ్యంలో సదస్సులో చర్చించారు. ‘‘కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయి. అవి ఆశలతో పాటు భయాన్నీ తీసుకొస్తాయి. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరమూ సిద్ధంగా లేదు. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశాం. నాస్కామ్ సహకారంతో ఏఐ ఫ్రేమ్ వర్క్‌కు రూపకల్పన జరుగుతుంది. ఆవిష్కరణలకు పారిశ్రామిక నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తోంది. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దాం’’అని సీఎం పిలుపునిచ్చారు.
200 ఎకరాల్లో ఏఐ సిటీ
హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ఫోర్త్ సిటీలో 200 ఎకరాల్లో ఏఐ సిటీ నిర్మించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌రెడ్డి ఏఐ సిటీ లోగోను ఆవిష్కరించారు. అలాగే ఏఐ రోడ్‌మ్యాప్‌ను విడుదల చేశారు. ఏఐ అభివృద్ధి చర్యలపై 25 కార్యక్రమాలతో ఐటీ శాఖ రోడ్‌మ్యాప్ రూపొందించింది.