తెలంగాణకు రానున్న మరో అంతర్జాతీయ సంస్థ
తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు సాగించేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చింది. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మొబిలీటీలో దిగ్గజమైన జర్మనీకి చెందిన బాష్ కంపెనీ తన గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పరిశోధన (ఆర్అండ్డీ) కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ సంస్థ ద్వారా కొత్తగా 3 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. అతి త్వరలోనే ఈ సంస్థ పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుందని తెలిపారు. బాష్ ప్రతినిధులతో జరిగిన వర్చువల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
తెలంగాణలో భాష్ కేంద్రం ఏర్పాటుకు అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయన్నాని మంత్రి తెలిపారు. ఇక్కడ కావాల్సినంత టెక్ టాలెంట్ అందుబాటులో ఉందన్నారు. గతంలో ఇక్కడకు వచ్చిన కంపెనీలు ముందుగా ప్రకటించిన దాని కంటే ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన భాష్ ప్రతినిధులకు వివరించారు. భాష్ పరిశోధన కేంద్రం ఏర్పాటు సీఎం కేసీఆర్ విజన్‌కు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. పరిశోధన కేంద్రం ఏర్పాటును త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని కంపెనీ వీపీ సుందరామన్ తెలిపారు. ఈ సమావేశంలో బాష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉపాధ్యక్షుడు, సెంటర్ హెడ్ కిరణ్ సుందర రామన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.






