తెలంగాణలో టెలిపెర్ఫార్మెన్స్ పెట్టుబడులు!

తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సంస్థ టెలిపెర్ఫార్మెన్స్ ముందుకొచ్చింది. త్వరలోనే హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాలుగా ఉన్న పలు జిల్లా కేంద్రాల్లోనూ తమ సంస్థ కార్యకలాపాలను ప్రారంభిస్తామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మమతా లాంబా ప్రకటించారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. సంస్థ ఈ నెల 5 నుంచి 8 వరకు ఐటీసీ కోహినూర్‌లో నిర్వహిస్తున్న ఇమ్మెన్సివ్ ఈవెంట్‌కు హాజరు కావాలని మంత్రిని ఆహ్వానించారు. తమ సంస్థలో దేశవ్యాప్తంగా 90వేల మంది, ప్రపంచవ్యాప్తంగా 95 దేశాల్లో 5 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు మంత్రికి తెలిపారు. సంస్థ పెట్టుబుడులకు, కార్యకలాపాలకు ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కంపెనీ ప్రతినిధులు శివ ఊలపల్లి, ఫణిందర్ నల్లబెల్లి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.