High Court : తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు

తెలంగాణ హైకోర్టు (High Court ) కు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. న్యాయవాదుల కోటా నుంచి గౌస్ మీరా మొహినుద్దీన్ (Ghaus Meera Mohinuddin) , సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి (Vakiti Ramakrishna Reddy) , గాడి ప్రవీణ్ కుమార్‌లను అదనపు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు (Supreme Court) కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో వీరిని అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ (Narasimha Sharma) తోపాటు కొత్తగా అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్ గవర్నర్ జిష్టుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరు ఈ నెల 31న ప్రమాణం చేసే అవకాశం ఉంది.