త్వరలో హైదరాబాద్కు మరో అంతర్జాతీయ బ్రాండ్
హైదరాబాద్కు త్వరలో మరో అంతర్జాతీయ బ్రాండ్ రాబోతోంది. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ ఫిస్కర్ ఇంక్ నగరంలో గ్లోబల్ టెక్నికల్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. కంపెనీ తన కార్లకు అవసరమైన సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఈ సెంటర్లో అభివృద్ధి చేయనుంది. ఇందు కోసం కంపెనీ ఈ టెక్నికల్ సెంటర్లో 300 మందికి పైగా ఇంజనీర్లను నియమించుకోనుంది. బీఎండబ్ల్యూ జెడ్8, ఆస్టన్ మార్టిన్ డీబీ9 వంటి ప్రముఖ లగ్జరీ మోడళ్లను డిజైన్ చేసిన ప్రఖ్యాత కార్ డిజైనర్ హెన్రిక్ ఫిస్కర్ ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆయన బార్య గీతా ఫిస్కర్ భారత్కు చెందినవారే కావడం గమనార్హం.






