KCR: అమెరికా పర్యటనకు మాజీ సీఎం కేసీఆర్!

బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమెరికా (America) పర్యటనకు తొలిసారి వెళ్లనున్నారు. ఉద్యమ సమయంలోనే కాదు, పదేళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఏ రోజు కేసీఆర్ (KCR) అమెరికా వెళ్లిన దాఖలాలు లేవు. దీంతో కేసీఆర్ అమెరికా పర్యటన ఆసక్తి రేపుతోంది. ఆయన విదేశీ పర్యటనపై పార్టీ కేడర్‌లో సైతం జోరుగా చర్చ జరుగుతోంది. కానీ కేసీఆర్ ఎప్పుడు వెళ్లేది ఇంకా ఖరారు కాలేదని సమాచారం. అటు కేసీఆర్ బంధువులు, కేటీఆర్ ఫ్యామిలీ (ktr family) నుంచి కానీ కేసీఆర్ పర్యటనను ఇంకా ధృవీకరించలేదు. కానీ పార్టీ వర్గాల్లో మాత్రం భారీ చర్చ జరుగుతోంది. అమెరికాలో ఆయన దాదాపు రెండు నెలల పాటు ఉంటారనే ప్రచారం పెద్ద పెట్టున సాగుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ ఓటమి పాలైంది. దీంతో నాటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితయ్యారు. ఇంకా చెప్పాలంటే పార్టీ కార్యాక్రమాల్లోనే కాదు, ప్రజా సమస్యలపై సైతం ఆయన స్పందించిన దాఖలాలు అయితే లేవు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు అంతర్గతంగా ఓ ప్రచారం సాగుతోంది. అలాంటి వేళ కేసీఆర్ అమెరికా ప్రయాణం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి కేసీఆర్ అమెరికా వెళ్లితే రెండు నెలలు ఉంటారని తెలుస్తుంది. మరి ఆయన ఎప్పుడూ వెళ్తారనేది మాత్రం ఫిక్స్ కాలేదు.