Errabelli : బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేశారు : ఎర్రబెల్లి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయకార్ రావు (Errabelli Dayakar Rao) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని, ఇంటింటికీ గ్యారంటీ కార్డులిచ్చి మోసం చేశారంటూ మండిపడ్డారు. అబద్ధాలను కూడా నిజం చేసే మాటకారి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ ను నమ్మే పరిస్థితి లేదన్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేదని అన్నారు. వరంగల్ (Warangal), కరీంనగర్‌లో మంత్రులు మంత్రులే కొట్టుకుంటున్నారని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ప్రజలు తిరగపడతారని రిజర్వేషన్ల అంశం తెరపైకి తెచ్చి డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలకు రిజర్వేషన్ల హక్కు ఇవ్వడమనేది నేరమని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. బీసీ (BC) లను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను మరిపించడం కోసం రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల డ్రామా ఆడుతున్నారంటూ ధ్వజమెత్తారు.