EB-5: గ్రీన్‌కార్డుకు అత్యుత్తమ మార్గం ఈబీ 5 : ఇల్యా ఫిష్కిన్

అమెరికా గ్రీన్ కార్డు పొందడానికి అత్యుత్తమ మార్గం ఈబీ-5 (ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్) వీసాయేనని ఆ దేశానికి చెందిన ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఇల్యా ఫిష్కిన్ (Ilya Fishkin) అన్నారు. అమెరికాలో పెట్టుబడులకు సంబంధించిన వీసా ప్రోగ్రామ్ ఈబీ-5 (EB-5) గురించి వివరించేందుకు తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆవరణలో న్యూయార్క్ (New York) ఇమ్మిగ్రేషన్ ఫండ్ ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈబీ-5 ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ భాగస్వాములు సుబ్బరాజు పేరిచెర్ల, సంపన్ మల్హోత్రాలతో పాటు ఇల్యా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రంప్ వీసా నిబంధనలను కఠినతరం చేసిన తరువాత చాలామంది భారతీయులు ఈబీ-5 పథకం వైపు చూస్తున్నారని తెలిపారు. శాశ్వతంగా యూ స్ ఏ లో నివసించాలనుకునే వారికి ఈ పథకం తోడ్పడుతుందన్నారు. ఈబీ-5 వీసా కోసం ఫార్మ్ ఐ-526 పూర్తి చేయాల్సి ఉంటుందని, అమెరికాలో టార్గెటెడ్ ఎంప్లాయ్‌మెంట్ ఏరియాలో కనీసం 8 లక్షల డాలర్లను, ఇతర ప్రాంతాల్లో 10.50 లక్షల డాలర్లను పెట్టుబడిగా పెట్టాలని, లేదా కనీసం 10 మంది అమెరికన్లకు పూర్తిస్ధాయి ఉద్యోగాలను అందించేలా సంస్ధను ఏర్పాటుచేయాల్సి ఉంటుందని సుబ్బరాజు, సంపన్ మల్హొత్రా తెలిపారు. అర్హత కలిగిన వారికి తొలుత రెండు సంవత్సరాలకు షరతులతో కూడిన గ్రీన్‌కార్డును అందిస్తారని, ఆ తరువాత ఐ-829ను దరఖాస్తు చేయాల్సి ఉంటుందని వివరించారు.