Etala Rajender :బీసీల జనాభా ఎందుకు తగ్గిందో సీఎం చెప్పాలి : ఎంపీ ఈటల

రాష్ట్రాల వారీగా కులగణనకు బీజేపీ అనుకూలమని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. హైదరాబాద్‌లో ఈటల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ (BC)ల జనాభా ఎందుకు తగ్గిందో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పాలని డిమాండ్ చేశారు. కులగణనపై కాంగ్రెస్ (Congress) ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు భారీగానే నిధులు ఇచ్చింది. రామగుండం ఎరువుల పరిశ్రమకు రూ.6,300 కోట్లు మంజూరు చేసింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తోంది. మేడిన్ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తోంది. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రూ.వేలకోట్ల రుణాలు మంజూరు చేస్తోంది. బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయొచ్చు కదా? ప్రజలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే పరిశ్రమ పెట్టొచ్చు కదా? అని అన్నారు.