Minister Seethakka : పర్యాటక శాఖతో కలిసి జంపన్నవాగు అభివృద్ధి : మంత్రి సీతక్క

పర్యాటకశాఖతో కలిసి జంపన్న వాగును అభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క(Seethakka) అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశాలతో మేడారం (Medaram) జాతరకు వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. స్మృతి వనాన్ని 29 ఎకరాల్లో ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆదివాసీ పూజారులతో కలిసి స్మృతి వనాన్ని అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. నిధులు మంజూరు చేసినందుకు సీఎం, డిప్యూటీ సీఎం (Deputy CM)కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలుగు ప్రజల గొప్ప జాతర సమ్మక్క సారలమ్మ జాతర. ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది అని సీతక్క తెలిపారు.