Bhatti Vikramarka : ప్రపంచానికే ఆదర్శంగా ఉండేలా ఫ్యూచర్ సిటీ : భట్టి

ప్యూచర్ సిటీని నెట్‌జీరో సిటీగా నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. ఐజీబీసీ ఆధ్వర్యంలో నోవాటెల్‌లో నిర్వహించిన గ్రీన్ తెలంగాణ సమ్మిట్ (Green Telangana Summit ) ను భట్టి ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచానికే ఆదర్శంగా ఉండేలా ఫ్యూచర్ సిటీ (Future City ) ని నిర్మిస్తాం. ప్రభుత్వ అంకితభావం చాటిచెప్పడానికే ఐజీబీసీ (IGBC) తో ఫ్యూచర్ సిటీపై ఎంఓయూ కుదుర్చుకున్నాం. రాష్ట్రాభివృద్ధి, అన్ని వర్గాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేలా మినహాయింపునిచ్చాం. రాష్ట్ర ఆదాయం తగ్గుతుందని తెలిసినా, ప్రజల ఆరోగ్య దృష్టా ఈవీ పాలసీ తీసుకొచ్చాం. హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలను మరింత పెంచేలా రూ.10 వేల కోట్లను కేటాయించాం. మూసీ(Musi) సుందరీకరణ చేపట్టాం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో స్థిరాస్తి రంగం ఆశించిన స్థాయిలో ఉంది. స్థిరాస్తి వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని అన్నారు.