Dattatreya:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు దత్తాత్రేయ ఆహ్వానం

దసరా (Dussehra) పండగా సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే అలయ్ బలయ్ (Alai Balai) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu ) ను హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ (Dattatreya) ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపదిముర్ముతో దత్తాత్రేయ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అన్ని పార్టీలను ఒకే వేదికపై తీసుకువచ్చి నిర్వహించే ఓ సాంస్కృతిక కార్యక్రమమే అలయ్ బలయ్ అంటూ రాష్ట్రపతికి వివరించారు. ప్రతీ ఏటా ప్రేమ, ఆప్యాయత, సోదరభావం చాటేలా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని రాష్ట్రపతి పేర్కొన్నారు.