తెలంగాణలో 1132కు చేరిన కేసుల సంఖ్య
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. 34 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,132కు చేరింది. వీరిలో 29 మంది మృతిచెందగా, 727 మంది కోలుకొని ఇండ్లకు చేరారు. ప్రస్తుతం 376 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 75 ఏండ్ల వృద్ధుడితో పాటు ఇతర అనారోగ్య సమస్యలున్నవారు పలువురు సైతం చికిత్స అనంతరం వైరస్ నెగెటివ్ రావడంతో శుక్రవారం డిశ్చార్జి అయ్యారు.






