తెలంగాణలో 1107కు పెరిగిన బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌తో బుధవారం మరో 11 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే కావడం గమనార్హం. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1107కు పెరిగింది. వైరస్ బారినపడి ప్రస్తుతం ఆసుపత్రుల్లో 430 మంది చికిత్స పొందుతున్నారు. బుధవారం 20 మంది ఆసుపత్రలు నుంచి డిశ్ఛార్జి అయ్యారు. వీరిలో హైదరాబాద్‌లో 10 మంది, సూర్యాపేటలో ఇద్దరు, వికారాబాద్‌లో 1, ఖమ్మంలో 1, ఆదిలాబాద్‌లో 2, మేడ్చల్‌లో 1, నిర్మల్‌లో 1, గద్వాలలో ఇద్దరు ఉన్నారు. దీంతో వైరస్ బారి నుంచి కోలుకొని ఆరోగ్యవంతులుగా ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 648కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మహమ్మారి కోరల్లో చిక్కుకుని 29 మంది మృతిచెందారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో గత 14 రోజుల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు.






