హైదరాబాద్ లో ఒక్కరోజే 79 కేసులు
తెలంగాణలో కరోనా క్రమంగా ఉగ్రరూపం దాల్చుతోంది. పాజిటివ్ కేసుల అనూహ్యంగా పెరిగాయి. సోమవారం రికార్డు స్థాయిలో 79 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. ఒక్కరోజులో ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కాగా, ఈ అన్ని కేసులు గ్రేటర్ పరిధిలోనివే కావడం గమనార్హం. ఇదిలావుంటే జియాగూడలో గడిచిన 24 గంటల్లో 25 మంది వైరస్ సోకడంతో అక్కడి ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. రోజుకురోజుకు పెరుగుతున్న కేసులతో బస్తీ వాసులు వణికిపోతున్నారు. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1275కి చేరింది. ఇక సోమవారం 50 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 801 మంది కోలుకొని ఇంటికెళ్లారని ప్రభుత్వ బులిటెన్లో పేర్కొన్నారు.






