Jubilee Hills: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ (Naveen Yadav) పేరును ఏఐసీసీ ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ (K.C. Venugopal) ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం నలుగురు అభ్యర్థుల పేర్లను ఏఐసీసీకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ( పీసీసీ) సిఫార్సు చేయగా నవీన్ యాదవ్‌ను ఎంపిక చేసింది. మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) , అజారుద్దీన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ (Bonthu Rammohan) వంటివారు గట్టిగా ప్రయత్నాలు చేసినప్పటికి యువకుడైన నవీన్ వైపే అధిష్ఠానం మొగ్టు చూపింది.