Jeevan Reddy : కాంగ్రెస్‌లో వీహెచ్ తర్వాత నేనే సీనియర్‌ను

పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సీనియర్‌నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. జిల్లాలో దశాబ్దాకాలం ఒంటరిగా పోరాటం చేశానన్నారు. కాంగ్రెస్ (Congress ) అంటే జీవన్ రెడ్డి, అనే విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేశానని చెప్పారు. కాంగ్రెస్‌లో వీహెచ్ (VH)తర్వాత నేనే సీనియర్‌ను. జానారెడ్డి (Jana Reddy) కూడా నాకంటే నాలుగేళ్ల తర్వాత వచ్చారు. పార్టీలో సీనియార్టీకి స్థానం ఏమిటనే బాధ నాలో ఉంది. కొందరు సీనియర్లు వారి అభిప్రాయాలతో మాట్లాడి ఉండొచ్చు అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.