Raghunandan Rao : కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణ చేయాలి

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు (Raghunandan Rao) విమర్శించారు. తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్రమంత్రి పదువులు దక్కాయని, వారిలో ఒకరు బీసీ (BC) నేతని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లపై చర్చించేందుకు ఎక్కడికైనా వస్తానన్నారు. బీసీలు 56 శాతం ఉంటే, ముగ్గురికే రాష్ట్ర మంత్రి పదవులు ఇచ్చారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణ చేయాలి. కేటీఆర్ (KTR,) , ఎంపీ సి.ఎం.రమేశ్ (C.M. Ramesh ) అంశంలో పార్టీలో చర్చిస్తాం. హెచ్‌సీయూ భూముల అంశంలో కేటీఆర్ బట్టకాల్చి మాపై వేశారు. నాపై కొండా విశేశ్వర్వర్‌రెడ్డి (Konda Viseshwarvar Reddy) పై ఆరోపణలు చేశారు అని అన్నారు.