KTR : కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డిపై.. పోలీసులకు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) , ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Kaushik Reddy ) పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmuri Venkat) సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy )పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ కేటీఆర్, కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తామన్నారు.