హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్ సోదరుడు

దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్ నోటీసులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి స్పందించారు. అమర్ సొసైటీలో ఇంటిని కొనుగోలు చేశా. నాకు ఇల్లు అమ్మిన యజమాని అన్ని అనుమతులతోనే ఇంటిని నిర్మించారు. కొనుగోలు చేసేటప్పుడు బఫర్ జోన్‌లో ఉందని చెప్పలేదు. నా ఇల్లు బఫర్ జోన్‌లో ఉందని ఇప్పుడు నోటీసులు వచ్చాయి. నిబంధనల ప్రకారం లేకుంటే కూల్చేయవచ్చు. సమయం ఇస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతా. బీఆర్‌ఎస్ నేతలు నన్ను లక్ష్యంగా చేసుకొని అమర్ సొసైటీ వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. నన్ను లక్ష్యంగా చేసుకోకపోతే మిగతా వాళ్లు ఇబ్బంది పడేవాళ్లు కాదు అని తిరుపతి రెడ్డి అన్నారు. తిరుపతిరెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు. మాదాపూర్‌లోని అమర్ కో ఆపరేటివ్ సొసైటీలో ఆయన నివాసముంటున్నారు. ఆ ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో నోటీసులు అంటించారు.