Polepalli : ఎల్లమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్

వికారాబాద్ జిల్లా పోలేపల్లి (Polepalli)లో రేణుక ఎల్లమ్మ తల్లిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి చేరుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు రేవంత్ రెడ్డికి అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. సీఎం వెంట మంత్రులు దామోదర రాజనర్సింహ(Rajanarsimha), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Srinivas Reddy), జూపల్లి కృష్ణారావు(, Krishna Rao), పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.