Revanth Reddy:నేను ఎవరి వెనకా లేను .. తెలంగాణ ప్రజలకు తోడుగా : సీఎం రేవంత్ రెడ్డి

తాను ఎవరి వెనకా లేనని, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తోడుగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల శివారులో ఎస్‌జీడీ కార్నింగ్ టెక్నాలజీస్ ఫర్నేస్ లైటింగ్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్(BRS) ను ఉద్దేశించి మాట్లాడుతూ ఏ పార్టీని బతకన్విమని, ఎవరూ రాజకీయం చేయొద్దని ఒకప్పుడు అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని జైలుకు పంపించారు. చేసుకున్నోడికి చేసుకున్నంత అని పెద్దలు చెప్పారు. నేడు వారిలో వారే తన్నుకుంటున్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని ఒకరినొకరు కౌగిలించుకుంటున్నారు.ఎవరూ అక్కర్లేదు. వాళ్లను వాళ్లే పొడుచుకుంటారు. గతంలో ఉన్న జనతా పార్టీ (Janata Party) కనుమరుగైంది. టీడీపీ అద్భుతమైన పార్టీ. చాలామందికి అవకాశాలు కల్పించింది. ఇప్పుడు తెలంగాణలో సమస్యలను ఎదుర్కొంటోంది. అది (బీఆర్‌ఎస్) కూడా కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అని పేర్కొన్నారు.