Revanth Reddy : పీవీ నరసింహారావు తర్వాత జైపాల్ రెడ్డి మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

జైపాల్‌రెడ్డి నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) అన్నారు. జైపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్ర ఎన్నటికీ మరువలేనిదన్నారు. జైపాల్ రెడ్డి (Jaipal Reddy) లేకుంటే తెలంగాణ సాకారమయ్యేది కాదని తెలిపారు. జైపాల్‌రెడ్డికి ప్రతిపక్ష పార్టీలతో సిద్ధాంతపరంగా మాత్రమే విభేదాలు ఉండేనని, రాజకీయాల్లో 40 ఏళ్ల పాటు ఆయన అజాతశత్రువుగా ఉన్నారని తెలిపారు. సమాచారహక్కు చట్టం రావడంలో జైపాల్‌రెడ్డి కృషి ఎంతో ఉంది. సంస్కరణల అమలుకు కూడా ఆయన ఎంతో తాపత్రయపడేవారు. కల్వకుర్తి (Kalvakurti) ప్రాంతంలో మార్పుల కోసం ఎంతో కృషి చేశారు. తెలంగాణ నుంచి పీవీ నరసింహారావు (PV Narasimha Rao) తర్వాత అంతపేరు తెచ్చుకున్నది జైపాల్ రెడ్డి మాత్రమే. రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గాలని ఆయన చెబుతుండేవారు. తెలంగాణ కోసం జైపాల్‌రెడ్డి ఎంతో చొరవ చూపారని సోనియాగాంధీ (Sonia Gandhi) కూడా ఓసారి చెప్పారు. ఇవాళ ఐడియాలజీ పాలిటిక్స్ కనుమరుగై స్విగ్గి పాలిటిక్స్ వచ్చాయి. ఇవాళ రాజకీయాలు ప్రమాదకరమైన దిశలో వెళ్తున్నాయి. ప్రజాస్వామిక విలువలు తగ్గి, పొలిటికల్ మెనేజ్‌మెంట్ పెరిగింది అని అన్నారు.