Revanth Reddy : పార్టీ కోసం కష్టపడితేనే… నాయకుల చుట్టూ తిరిగితే రావు

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్‌పై ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) అన్నారు. గాంధీభవన్ (Gandhi Bhavan)లో జరిగిన యువజన కాంగ్రెస్ (Youth Congress) నేతల ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం పోరాడిన అందరికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్నారు. 37 కార్పొరేషన్లకు చైర్మన్లు, అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించాం. ప్రతి పేదవాడు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్‌పై ఉంది. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో యువత ఎక్కువగా పాల్గొనాలి. పార్టీలో కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది. పైసలు ఉంటే ఎన్నికల్లో గెలవరు. ప్రజాబలం ఉంటేనే గెలుస్తారు. పార్టీ కోసం కష్టపడకుండా కేవలం నాయకుల చుట్టూ తిరిగితే మాత్రం పదవులు ఉండవు. కేవలం డబ్బులలోనే రాజకీయాల్లో విజయం సాధిస్తామని అనుకోవద్దు. గల్లీ నుంచి పోరాడితేనే ఢల్లీి (Delhi ) వరకు ఎదిగే అవకాశం వస్తుంది అని అన్నారు.