Revanth Reddy : ఆ జిల్లాల్లో వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వండి : సీఎం రేవంత్ ఆదేశం

కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ అధికారులతో జరిపిన సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డు (Ration cards )లు ఇవ్వాల్సిందేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ఈ కోడ్ అమలులో లేని జిల్లా(District) ల్లో వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొత్త వారితో పాటు కార్డులు ఉన్నవారు సైతం కొత్తగా సభ్యులను చేర్చేందుకు దరఖాస్తులు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా, మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు.