TRGS: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025.. నేటి నుంచి ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు ప్రారంభం
డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) 2025 నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వివిధ విభాగాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కు తుది మెరుగులు దిద్దుతారు. ఈరోజు నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో వరుసగా ఈ సమీక్ష సమావేశాలు జరుగుతాయి. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు వరుసగా జరిగే అన్ని సమావేశాల్లో పాల్గొంటారు. ఆయా విభాగాల సమీక్షలో సంబంధిత మంత్రులు పాల్గొంటారు.
నవంబర్ 25- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిర్వహణ ఏర్పాట్లు
సీఎంతో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ఆయా విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొంటారు.
నవంబర్ 26 – లాజిస్టిక్స్, ఏర్పాట్లు
సీఎంతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు సంబంధిత అధికారులు.
నవంబర్ 27 – మౌలిక వసతులు, అభివృద్ధి
సీఎంతో పాటు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీతక్క, మోహమ్మద్ అజరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. సంబంధిత విభాగాల అధికారులు.
నవంబర్ 28 – విద్య, యువజన సంక్షేమం
సాయంత్రం 4 గంటలకు సీఎంతో పాటు మంత్రులు వాకాటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, సంబంధిత విభాగాల అధికారులు .
సాయంత్రం 6 గంటలకు:
టూరిజం, టెంపుల్ టూరిజం
మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ సంబంధిత అధికారులు
నవంబర్ 29 – వ్యవసాయం, సంక్షేమ విభాగాలు
సాయంత్రం 4 గంటలకు: మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వాకాటి శ్రీహరి సంబంధిత అధికారులు.
సాయంత్రం 6 గంటలకు: మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , సీతక్క , మోహమ్మద్ అజరుద్దీన్.
నవంబర్ 30 – ఆరోగ్య రంగం
సీఎంతో పాటు మంత్రి దామోదర్ రాజనరసింహ సంబంధిత అధికారులు.






